నువ్వు-నేను
నీ కళ్ళలోకి చూసిన ప్రతీసారి
నాకు తెలుస్తుంది..నా మీద నీకున్న భావనేమిటో
నాకోసం నీవుపడే ఆరాటం చెపుతుంది..
నేను నీకు ఏమవుతానో
అప్పుడప్పుడు నా కళ్ళకి పట్టుబడే
నీ కన్నుల తడబాటు చూస్తుంటే
భలే సరదా అనిపిస్తుంది
నీ యద ఘోష నాకు తెలుసురా..అని
చెవి మెలిపెట్టి మరీ చెప్పాలనిపిస్తూవుంటుంది
కానీ
ఇంతగా ఆరాధిస్తున్న నువ్వు
ఆ మాట చెపుతుంటే వినాలనివుంది
అందుకే...గోదారి లాంటి నా ప్రేమకు ఆనకట్ట వేసి
తొలకరి చినుకు లాంటి నీ మాటకై ఎదురుచూస్తున్నాను
నీ అడుగు తో జత కలిపే క్షణం కోసం ఆశగా నిరీక్షిస్తున్నాను
9 comments:
really very good one...
very good one.....
thanks valli and anonymous.
anonymous mee name raste baagundedamdi.
@రాధిక గారు
ఇదే మగాడికి వచ్చే కష్టమంటే.. నేను అనుకుంటాను ఒకమ్మాయికి చాల తేలికగ తెలిసిపొతుంది ఒక అబ్బాయికి తనంటే ఇష్టమొ కాదొ అని... కానీ అబ్బాయి పాపం తెలుసుకొడానికి చాలా కష్టం.. బహుశా ఆ అయోమయం వల్లేనేమొ అబ్బాయి త్వరగ మనసు విప్పలేడు అమ్మాయి ఎదురుపడి...
చాలా నచ్చింది... భలే క్రేజిగా రాసారు...

Nijanga aaa feeling bagundandi.........chaala baaga express chesaru oka ammayi thoughts ni......
HI,Radhika
Wow its sooooo nice kavitha radhika.
Thanks
Prasad
Post a Comment