Monday, September 11, 2006

ఓ భావన


ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను...ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ

అమ్రుతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనం తో వుంటుంది
అందరిని తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ...

మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]...ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ

4 comments:

Anonymous said...

"అమృతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనం తో వుంటుంది"

ఇది చాలా నచ్చింది నాకు.
ఇందులో నేను చెప్పలేని చాలా అందమైన అర్థాలు తోస్తున్నాయి నాకు.

లలిత.

bhanu said...

ఈ కవిత చాలా సరళమైన పదాలతో చాలా అద్భుతముగా ఉన్నది.
ఈ కవితకి మీకు ఇవే నా అభివందనములు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
నా మది said...

రాదిక గారు ఈరోజులలొ చాల మంది ప్రేమ అనగానే ప్రేయసి,ప్రియులమద్య ఉన్నదే అన్నంత సంకుచితంగ రాస్తున్నారు(చూస్తున్నారు), మీరు ప్రెమ యొక్క విశ్వరూపాన్ని చూపారు.
రఘు