
తనొక జ్ఞాపకమై వుంటానంది
నేను వద్దన్నాను
తనొక అనుభూతిగా మిగులుతానంది
నేను కుదరదన్నాను
గుండెల్లొ నిలుస్తానుగా అంది
సదా కళ్ళెదుట వుండమన్నాను
గతమై నా వెనుక వుంటానంది
జత గా నా పక్క నడవమన్నాను
జన్మంటూ వుంటే నీ కోసమే అంది
నీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నాను
మొదట ఓదార్చింది--తరువాత వివరించింది
బ్రతికి సాధించమంది
సాధించి దానిలో తనను బ్రతికించమంది
కళ్ళు తుడుచుకున్నాను
నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూ
ఎదురుగా నా లక్ష్యం రూపం లో ఆమె
9 comments:
ఇంత అద్భుతమైన బొమ్మ ఎక్కడ దొరికిందో చెప్పగలరా?
ee bomma nenu abhisarika gari blog nundi copy chesanandi.
B
E
A
U
T
I
F
U
L
!!
కొత్త పాళీ గారూ నా బ్లాగులోని అందరి కామెంట్లు చదువుతుంటే చాలా ఆనందం గా వుంటుంది.మీ కామెంట్ చదివితే ధైర్యం గా వుంటుంది.
ఎంత బాగా వ్రాసారండి. జోహార్లు
HI. Radhika Garu
en thaki a varu Ame mukhamu chupinchanantundhi paravaledhu mirumathram chalabagawrasinaru.
Thanks - Prasad*
Y-Prasad@in.Com
నిజం బాగుంటుంది. ఊహ ఇంకా బాగుంటుంది. మీ కవిత కళ్ళ ఎదుట ఉన్న నిజాన్ని మరిపించి ఊహల లోకి తీసుకు వెళ్తోందిఅండి. బహుశా అది కవిత తత్వమేమో !
HI Radhika Garu,
Chala Bhaga Rasaru..Naa Manasuloni bhavalaku akshara roopam ichinattu ga vundhi mee kavitha. Manasu Bhadanu Madhuranga Varnincharu...Meeku Joharlu..
Post a Comment