నిజమేనేమో?
కనులకు నచ్చినదానికన్నా మనసుకు
నచ్చిందే విలువైనదిగా అనిపిస్తుంది
మరణం కన్నా మరణిస్తామన్న ఊహే
భయంకరం గా అనిపిస్తుంది
వర్తమానం కన్న అది గతం లా
గుర్తుచేసుకున్నప్పుడే ఆనందం గా అనిపిస్తుంది
నాకు నీతో వుంటున్నప్పటికన్నా
నీ జ్ఞాపకమే హాయి గా అనిపిస్తుంది
ఎవరో అన్నట్టుగా
నేను నీకన్నా నిన్ను ప్రేమిస్తున్నానన్నభావననే
ఎక్కువ ప్రేమిస్తున్నానేమో?
5 comments:
నాకు నీతో వుంటున్నప్పటికన్నా
నీ జ్ఞాపకమే హాయి గా అనిపిస్తుంది
ఒక్కొసారి అనిపిస్తూవుంటుంది..
నీను నీకన్నా నిన్ను ప్రేమిస్తున్నానన్నభావననే
ఎక్కువ ప్రేమిస్తున్నానేమో అని
:-) .. baga chepparu
చాలా బాగా చెప్పారు... ఇంకా
దూరంగా ఉన్నప్పుడు నీతొ కబుర్లు చెప్పాలని ఉంటుంది, అప్పుడు నీ మౌనం నన్ను దహించివేస్తుంది...
దగ్గరగ ఉన్నప్పుడు నా మౌనం రాజ్యమేలుతుంది, అప్పుడు నీ మౌనం లొ కూడా నేను ఊసులు వెతుక్కోగలను...
ఈ నిజాలు అందరు గుర్తించేవే... కానీ ఇదే నిజం అని నమ్మడానికి, చాటడానికి ధైర్యం కావాలి...
Post a Comment