Monday, September 18, 2006

ఎదురుచూపు


అసలే నీ ఆలోచనలతో అలసిపోయిన అంతరంగం
నీకై ఎదురుచూసి ఎదురుచూసి సొలసిపోయింది

మెల్లమెల్లగా చీకట్లోకి చేరిపోతున్న వెలుగులా
కనులు నిజాన్ని విడిచి స్వప్నంలోకి జారిపోతున్నాయి
ఎప్పటికి తేరుకున్నానో..
కానీ అప్పటికే జీవితాన్ని చేజార్చుకున్నాను

కనుల కొలను నుండి చిమ్మిన ఆఖరి కన్నీరు బొట్టు
నువు తుడవకుండానే ఆవిరైపోయింది

చెంపలపై కన్నీటి చారికలు మాత్రం మిగిలినై
మన ప్రేమకు [క్షమించాలి....నా ప్రేమకు]అవశేషాలు గా

7 comments:

Anonymous said...

అద్భుతం!

Anonymous said...

gundelu pindeyatam kavitala tho koda cheyyochani,, ee kavitha chadivaka telusukunnanandi,,

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

nijam andi naadi ade position...chala baag chepparu

Giridhar Pottepalem said...
This comment has been removed by the author.
Giridhar Pottepalem said...

"...ఆఖరి కన్నీరు బొట్టు
నువు తుడవకుండానే ఆవిరైపోయింది"

మీ కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకదాన్ని మించి మరొకటి...

ఆలశ్యంగా మీ బ్లాగ్ ని చేరుకున్నా
ఆపకుండా మీ కవితలన్నీ చదివేస్తున్నా
చదివి ఎన్నో జ్ఞాపకాల్ని గుర్తుచేసుకొంటున్నా
మరిన్ని అనుభూతులకై ఎదురుచూస్తున్నా

మీ కవితలు చదివాక నా రాతలూ కవితలైపోతున్నాయ్.

Once again, Hats off.
- గిరిధర్ పొట్టేపాళెం

సుజ్జి said...

Chala baaga raasau.