నువ్వు చెప్పే తొలకరి చినుకుల్లాంటి
ముద్దు మాటల్లో ముద్దగా తడిసిపోవాలని
తొలి వేకువ నుండి ఎదురుచూస్తుంటాను
ఒంటరిగా కాదులే... తోడుగా నీ తలపులే !
నువ్వు ఒకసారి వచ్చి
వేల వసంతాలను కానుకిచ్చివెళతావు
అనుభూతుల వానలో తడిపి
ఆరేలోపు వచ్చేస్తానంటావు
నాకు మాత్రం
మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్ల తో
రేయి కల లా సాగిపోతుంది
నువ్వు తెచ్చే నవ్వుల కోసం
ఎదురుచూపుల్లో మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది !
4 comments:
ఇది మీ మరో అందమైన కవిత.
--ప్రసాద్
http://charasala.com/blog/
బాగుంది రాధిక :)
"అనుభూతుల వానలో తడిపి
ఆరేలోపు వచ్చేస్తానంటుంది"
!!!
రాధికా..
గడ్డకట్టిన గుండెను నీ భావాలతో కదిలిస్తావు.
ఎండిపోయిన కళ్ళ వెనుకనుంచి చెమరింతల్ని పట్టి తెస్తావు.
ఎక్కడో వదిలేసి వచ్చిన జ్ఞాపకాల లంకె బిందెల్ని తవ్వి తీస్తావు.
మా అనుభూతులతో ఆడుకునే ఈ అందమైన అధికారం నీకెవరిచ్చారు..
i'm really thankful to u నా మనుసుకి నన్ను గుర్తు చెయ్యటానికి సాయపడినందుకు..
Post a Comment