మది నిండిన ఎన్నో మధురానుభూతులనుఅప్పుడప్పుడూ ఒలక బోసుకునిఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లోసర్దుకుంటూ వుంటానుపాత పుస్తకాల పుటల్లోని నెమలీకలని..దాచుకున్న ఉత్తరాల మడతల్లోనిమనసుల రూపాలని..అపురూపంగా పరామర్శిస్తూవుంటానుపట్టలేని భావోద్వేగాలుయదను కుదిపేస్తూవుంటేవాటిని కన్నీరుగాను,కవితలుగాను మలచుకుంటూ..తిరిగిరాని బాల్యాన్నికన్నుల ముందు ఆవిష్కరించుకుంటూ వుంటానుఈ కవిత తొలి ప్రచురణ http://poddu.net/
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ఈ కవిత తొలి ప్రచురణ "పొద్దు" లో .http://poddu.net/
ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి... కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు?
అప్పటి వరకు బాధ అంటే తెలీదు అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప కన్నీళ్ళు అంటే తెలీదు నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప కష్టాలంటే తెలీదు నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప విడిపోవడం అంటే తెలీదు చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప మౌనంగ వుండడం తెలీదు సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప మరి ఈరోజేమిటి.. నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి వీడుకోలు చెప్పడం అంత కష్టమా?అరే...ఇదేమిటి?ఆకాశంలో కదా మేఘాలున్నాయి మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?