నేను-ఆనందం
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ఈ కవిత తొలి ప్రచురణ "పొద్దు" లో .http://poddu.net/
23 comments:
పొద్దు లో నా ఈ కవితకి వచ్చిన స్పందనలు
ప్రసాద్ ఇలా అన్నారు:
జనవరి 4, 2007 at 7:56 pm
అద్భుతంగా వుంది.
“వయసు పెరిగేకొద్దీ
మనసు చిన్నదయిపోతుందా?”
ఈ అనుమానం నాకూ ఎప్పటినుంచో వుంది. నా కాలేజీ రోజుల్లో నేనూ రాస్తూ వుండిన కవిత్వం నాకు ఇప్పుడు అందడం లేదు. అందమైన సృష్టిని చూసినప్పుడు నాలో రేగే ఆనంద పారవశ్యపు హద్దులు రోజురోజుకీ చిన్నవైపోతున్నాయి. రోహిణీ ప్రసాద్ గారయితే ప్రతి స్పందనకూ మెదడులో జరిగే కొన్ని చర్యల ఫలితమే నంటారు. మరి ఆ విధంగా చూస్తే వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు గడించే కొద్దీ మెదడుకు స్పందించే గుణం మొద్దుబారుతుందేమో!
“ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?”
ధనార్జనకీ ఆనందానికి సంబందం ఒక హద్దు వరకూ అనులోమానుపాతంలో వున్నా ఆ తర్వాత అది ఆనందానికి ఏ విధంగానూ తోడ్పడదు, పైగా బాధలు పెంచొచ్చు కూడా!
–ఫ్రసాద్
రానారె ఇలా అన్నారు:
జనవరి 5, 2007 at 1:14 am
సరిగ్గా ఇలాంటి అనుమానమే నాకూ వచ్చి, బాల్యపు జ్ఞాపకాలపై తడిసిన కంబళి లాంటి బాధ్యతల ముసుగు పడి ముగ్గిపోకముందే ఒక్కొక్కటీ జాగ్రత్తగా తవ్వితీసి తళతళలాడేట్టు మెరుగుపెట్టి భద్రంగా బ్లాగస్థం చేస్తున్నాను. తవ్వేకొద్దీ వస్తున్నాయి. నాకోసం రాసుకుంటున్నవే నాకూ తృప్తినిచ్చేవి. నేనెందుకు బ్లాగుతున్నాననే అస్పష్టమైన ఆలోచనకు మీ కవిత మెరుగుపెట్టింది. హృద్యమైన కవిత.
దేవి ఇలా అన్నారు:
జనవరి 5, 2007 at 6:36 pm
చాలా బాగా చెప్పారండీ! పదాల సందుల్లోనుంచి భావం జారిపోకుండా చక్కగా పట్టేస్కుంటారు మీరు.
చాల బావుందండి.
ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?
ఎప్పటికీ కాదు
విహారి.
cute one Radhikaa.
U rock.
బావుంది మీ కవిత...
చాలా బావుంది :)
మీ కవితలన్నీ మనసుకు హత్తుకునేలా ఉంటాయండి.అవి చదువుతుంటే మాకు అలాంటి అనుభూతులే కలిగినా అవి మీలా రాయలేము అనిపిస్తుంది.
chaala bavundi radhika garu!
:) Good one!
Vihaari gaaru , Prasad gaaru annatlu, Dabbuki, nijamaina aanandaaniki sambandham ledu. kontavaraku untundEmO kaani, DabbE aanandaanni maatram tIsukuraadu. Anyway! Anandaaniki okkokariki okkO definition untundanukondi.
bavundhi kavitha...
dhanam vache koddi anandam viluva perigithey bagundedhemo...
appudaina manasuki konchemaina badha thagguthundhemo...
No Comments. Obsoultely Gorgeous Poems...Keep it posting.
కవితలు తగ్గాయేవిటండీ? ఈ మధ్య రాయలేదా? మీ కవితల కోసం ఎదురుచూస్తూ...
ఖచ్చితంగా కాదు. ఆనందమనేది ధనంతో రాదు, అది మనసులో ఉండాలి.
ur blog is simply superb. nenu mee blog ni blog to link chestunnanu. plz permit me.
thanks karthik.permition avasaram ledandi.mii blog open avvadam ledu naaku .link ikkada ivvandi plz.
Ho Radhika,
Your blog is really awesome...!!!
Really i dont have words to apreciate you.
yet another time RK!! excellent!! you made me write again !!
manasu kadilindi.
తొలిపొద్దు సమయాన
మంచు పడ్డ గరికపువ్వును
గోడమీద పరుగెట్టే
గడియారం తొక్కింది !!
మురిపించే ఇంటి ముగ్గు
తొలిజాము గడబిడలొ
పిల్లవాని లంచ్ బాక్సు
లోన కెళ్ళి దాగింది !!
చిరువాన జల్లుల్లొ ఆడి
అలసిన మన మనసులు
ఈ జీవిత పరుగు పందాల్లో
చెమటలోన తడిసి సొలశై !!
జారి పోయే బ్రతుకు క్షణాలను
ఏరుకుంటూ సమసిపోయే ఈ బ్రతుకులకు
రాలిపోయే పూలు చూస్తూ
కన్నీరు కార్చే తరుణమేదీ ?
కరుడు కట్టిన గుండె తొడుగులు
చీల్చి లోపల తొంగి చూడు
భావుకత్వం, నీ సున్నితత్వం
కవిత లల్లుతూ బయటకొస్తాయి !!
Originally Posted by raviraash
edaarilo tirugaadutunna naaku
endamaavi la mee kavitha kanipinchindi
chadivintarvaata telisindi
adi manchi neeru kaadu, kobbari neellani!!!
కాలపు చట్రం
తరుముతు వుంటె
కాళ్లకింద నలిగే
పువ్వుల సంగతెలా
తెలుస్తుంది?
వయసు కొద్దీ
మనసు గొడకి
స్పర్శ తరిగి
కళ్ల అడుగున
కన్నీరే నిండుకుంటె,
ఆనంద భాష్పాలను
ఎలా ఆశించేది???
"vayasu perigE koddii
manasu chinnadaipOtundaa?"
chaalaa baagaa raasaaru. ee anumaanam raanivaarevvaruu unDarEmO. bahusaa, vayasu perigEkoddii, baadhyatalu peragaDamtoe, cakkani cinni vishayaalu gamaninchamEmO!
(chuusaaraa 'cinni' anEstunnaanu.)
chaalaa chakkagaa raasaaranDii.
oh naku aa puvvu ivvara nenu kiss chestanu chala bagundi
Radhika garu i became your fan. Your thoughts touched my hearts depts. While i was reading i feel like touching the sky, smelling flowes n looking at my love. thanks
radhika garu,, chala rojula taravata telugu sahityaanni malli aasvadinchaananadi,,, chala chala thanks,,mee kavithalaku,, meekunu,, naalo kooda oka chinnapati kavi unnadanipistundi,, sakulu cheppukoni eppudu vaayida vestuntanu.,, naa lo unna kala pipasini eppudu nirustaha parustune untanu,, good work andi,, mee blog ippudu one of my bookmarked site,, naaku oka blogspot undedi,, eppudo chinnappudu alaa konni raasi vadilesanu,, malli punaruddarinchali,, daanni,, meeru anduku oka vidanga inspiration anukondi,, thanks for that too,,
www.drpvraman.blogspot.com
oka sari choodandi,, ala time pass ki,,
Post a Comment