Saturday, February 03, 2007

నీ జ్ఞాపకం


ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా

పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని
కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని
చెరిగిపోయిన చిరునవ్వుని నీ చెలిమితో మరలా చిత్రించాలని..
ఎన్ని ఆశలో తెలుసా...

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది

9 comments:

తెలు'గోడు' unique speck said...

caalaa baavundi!

Vissu said...

Bavundi mee kavitha.

Anonymous said...

Chala bagundandi, nenu mee anni kavitalu chadivani. denikade anni bagunnayi /

Unknown said...

chaala chaala baagundanDi. Tooo good. chivara vaakyam marinta baagundi.

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది

- Venu

Ravi Kanth said...

Chaala bagunnai ane maata chaala mandi vaadesaru. kani i really mean it. feel ayite gani raayaleru ilaanti kavitalu...hats off to you..intakee asalu meerevaru?

Nagaraju Pappu said...

రాధికా,
దీన్నే, కొంచెం ఇలా మారిస్తే ఎలా ఉంటుంది?
టైటిల్: ఎన్నాళిలా

ఒంటరితనమే జంటగా
ఊహలతోనేనా నా ఊసులు

పంచుకోలేక పోగుపడిన స్మృతులని
మోయలేక కరిగిపోయిన కాలంతో
చెరిగిన చిరునవ్వుని చిత్రించలేక

ఆశ నిరాశలతో నా పెనుగాలట
నా చెక్కిలపై జాలువారుతూ
ఎన్నాళిలా, నీవురాక, ఒంటరిగా, ఎన్నాళిలా?

ఇంకొంచెం మెరుగులు దిద్దొచ్చుననుకోండి.
ఇలా మీ కవితలని తిరగారాసినందుకు క్షమించండి. చదవగానే అలా అనిపించింది.
--నాగరాజు.

రాధిక said...

మీరు చెప్పింది చాలా బాగుందండి.కానీ నేను మీరు చెప్పిన ఈ విధం గానే మరొక కవిత రాసాను.ఒక్కోసారి ఒకే అనుభూతిని వివిధ రకాలు గా చెప్పాలని ప్రయత్నిస్తూ వుంటాను.అప్పుడు అలా రాసేసాను కదా అని ఇప్పుడు ఇలా ప్రయత్నించాను.ఒక్కసారి నా పాత కవిత కూడా చదవిచెప్పండి.లింక్ ఇక్కడ ఇస్తున్నాను.మీరు నా కవితలకి మెరుగులు దిద్దుతుంటే చాలా అనందం గా వుంది.ఇలా ప్రోత్సహిస్తూ వుంటే నన్ను నేను మెరుగుపరచుకోడానికి ప్రయత్నిస్తాను.
http://snehama.blogspot.com/2006_10_01_archive.html
ఈ లింక్ లో "ఇంకా ఎంత కాలమిలా" అన్న కవితని చూడగలరు.

siva.pattapu said...

రాధిక గారు !
అమెరికాలో ఉన్నా మీలోని తెలుగు హృదయం మీ కవితలో ప్రతిఫలించిందంటే నమ్మండి. అసలు ఆంధ్ర దేశంలో ఇప్పుడున్న అమ్మాయిల్లో యెంత మందిలో ఇంత భావుకత ఉందండి. రాన్రానూ మన వాళ్లందరూ పాశ్చాత్య(అమెరికా) సంస్కృతి వైపు పరుగులు పెడుతుంటే మీరు అక్కడే ఉంటూ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలని నిలుపుకుంటున్నారు చూడండి. అది, మీలోని అచ్చమైన ఆంధ్రత్వం. ఇన్ని రోజులూ మీ కవితల్ని చూడనందుకు చాలా బధగా ఉందండి. మరో వైపు ఇప్పటికైనా చూశానన్న ఆనందమూ ఉందనుకోడి. వీలైతే మీ కవితల్ని నాకు మెయిల్ చెయ్యగలరా! పంపకున్నా ఫరవాలేదులెండి. మీ బ్లాగ్ అడ్డ్రెస్స్ తెలిసింది కదా అది చాలు.

రాధిక గారు!
నా కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు ముందుగా మీకు నా అభినందనలు. మీరన్నట్లు ఇందులో ఇతివృత్తం వాస్తవమైంది కాదు. కేవలం కల్పితం. అంతే కాదు, చెప్పాలంటె అది కొంత అసహజం కూడా. అయినా ఇటువంటి కథలు మన తెలుగు సాహిత్యంకి కొత్త కాదు, లేనివీ కాదూ! మనుషులు, జంతువులూ మధ్య నడిచిన అనేక కథలు మీక్కూడా తెలిసే వుంటాయి. అంతదూరం ఎందుకు పంచతంత్రం కథలు లేవా! నా ఉద్దేశ్యం నాకథ పంచతంత్రంతో పోల్చదగింది అని చెప్పడం కాదని గమనించగలరని మనవి. ఇది నా రెండో కథే. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెపుతుంటే విన్నది. దాన్ని చెప్పినట్లే కాకుండ కాసింత మార్చిరాశాననుకోండి అది వేరే విషయం.
చివరిగా ఒక్క మాట మీ లాంటి వాళ్ల ప్రోత్సాహం, సద్విమర్శా గనక వుంటే ఇక ముందు కూడా నానుంచి మరి కొన్ని కథలు పుట్టుకురాగలవు.
మరిక ఉంటానండి
చెప్పడం మర్చే పొయ్యా! నాపేరు శివ కుమార్
హైదరాబాదు విశ్వవిద్యాలయం లో ఎం.ఏ.(తెలుగు)చదువుతున్నాను.
నా జి మెయిల్ ఐడి ఇది- sarasu.psr@gmail.com
satavahanudu@gmail.com
sarasu.psr@rediffmail.com
మీకు మళ్లీ మరో సారి నా కృతజ్ఞ్తలు.

Anonymous said...

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది
chaaaaaala bagundi I feel this every day