ఎవరునువ్వు?
ఎవరునువ్వు?ఇలా ఎపుడుమారావు?నేనే గుర్తించలేనంతగానీకు నువ్వే నచ్చలేనంతగాఇలా ఎపుడు మారావు?వ్యక్తిత్వం వదిలిఅస్తిత్వం మరచివట్టి మెదడుతో అలా ఎలాబ్రతికేస్తున్నావు?మిధ్యాలోకం లో మిద్దెలు కడుతూమురిసిపోతున్నావా?పేకమేడలెపుడన్నా చూసావా?నీటి రాతలెపుడన్నా రాసావా?వాటి అనందం ఎంత సేపు?నీకుతెలీదా? ఇప్పటికన్నా చెప్పుమనిషిలా ఎపుడు మారతావు?నీలా నువ్వు మళ్ళా ఎప్పుడు పుడతావు?
25 comments:
Radhika garu. Mee blog ki nenu idi first time raavatam and the first poem nenu chadavagaane, I am left speechless, as if you are speaking to me.
మనిషిలా ఎపుడు మారతావు? అని అడిగితే ఏమి చెపుతాడు, మానవత్వపు మజిలి కూడా దాటేశాకా!
andaru edey samsya gurinchi alochistunnattunnaru...
vyaktitvam vadili..astitvam marachi..aa lines chala bavunnayi...
peka medalu eppudu choodaledu kani chala sarlu oohallo kattanu... andukenemo, oohallonchi bayataki vachi manavatvam gurinchi alochistunnanu
తమ ఆనందం కోసం..అదీ క్షణికమయిన వాటికోసం వేలకి వేలు ఖర్చుపెడుతూ అదేదో ఘనకార్యమయినట్టు సంబరం గా చెప్పుకుతిరుగుతున్న కొంతమందిని మొన్న ఒక పార్టీ లో చూసి బాధపడి ఇలా వ్యక్తపరిచాను.డబ్బు సంపాదించడం కోసం,జీవితాన్ని అనుభవించడం కోసం కొంత మంది వ్యక్తిత్వాన్ని వదిలేసుకుని... సానుభూతి,సహాయం అన్న మాటలకి అర్దాలు మర్చిపోయి బ్రతికేస్తున్న కొంతమంది మీది కోపం తో ఈ కవిత రాసాను.హరిత,వల్లూరి,జోష్ ....మీ అభిప్రాయాల్ను తెలియచేసినందుకు థాంక్స్.
రాధికగారూ మీ బోటివారి బ్లాగులు చూడటం వలన కలిగే ప్రయోజనం ఇదేనండి. భౌతిక జగత్తు తాలూకూ మత్తులో పడికొట్టుకుపోతున్నప్పుడు ఇటువంటి కవితలు చదవడం వలన తిరిగి ఒడ్డుకి చేరిన భావన కలుగుతుంది. మానవీయ విలువలతో కూడిన నిజమైన జీవన సౌందర్యాన్ని చూపే కవితలు చదివాక స్పందన రాయకుండా ఉండటం కష్టమేనండీ.
ఇదే కదా అసలు సమస్య. చాలా సందర్భాలలో మానవత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం, తప్పని తెలిసీ కొందరం, తెలియక మిగిలిన కొందరం.
అన్నట్లు కొత్త బ్లాగొకటి lalithageetaalu.wordpress.com మొదలెట్టా. ఒకసారి వచ్చి పోండి. అవునూ, బిజీయా. ఈమధ్య మీ రాక(త) లేక నా బ్లాగులన్నీ వెల్తిగా ఉన్నాయ్.
రాధిక గారూ
మీ కవిత చాలా హ్రుద్యంగా వుంది.మీరు చెప్పినలాంటి
వెగటు విందులు ఇటీవల కాలంలో ఇక్కడ ప్రతి పెళ్ళిలోనూ సర్వ సాధారణమైపోయాయి.పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే నే హడలు పుట్టేటన్ని వంటలు, స్వీట్లు, ఆఖరికి డిన్నర్లలో ఇడ్లీలు, దోశలు,ఇంకేంటేంటో పేరు వూరు తెలియని నానా చెత్త.వాళ్ళ డాబూ,దర్పమంతా ఈ రకరకాల వెర్రి మొర్రి తిళ్ళ మీద చూపిస్తున్నారు.మానవీయకోణం అన్నిచోట్ల మ్రుగ్యమౌతున్న సందర్భంలో మనం బతుకుతున్నాం.
రాధిక గారూ,
ఇది అందరూ అలోచించవలసిన కవిత. నేనెప్పుడో ఎక్కడో చదివి రాసి పెట్టుకున్న ఆంగ్ల కవిత గుర్తొస్తోంది. దాని అర్థం కూడా దాదాపు గా ఇలానే వుంది.( I want to re-learn how to laugh... అంటూ ఒకటుంది)
చాలా అద్భుతంగా చెప్పారు.
అయినా మీరిలా నెలకొకటి చొప్పన రేషన్ కార్డు తో ఇచ్చే అయిదు కేజీల చక్కెర లా రాస్తే ఎలాగా? కాస్త కీబోర్డును ఝుళిపించండి. అసలీ ముక్క మీరు దీన్ని రాసినప్పుడే చెప్తామనుకున్నా. మీ టపా చదివేసరికి ఎవడో బాసుగాడు వెనక్కొచ్చి చూశాడు. తరువాత దీని సంగతే మరిచిపోయా.
విహారి.
మీ కవితలలో నిస్సందేహంగా చాలామంది వ్యక్తీకరించలేని భావాలు సూటిగా కనిపిస్తాయండీ.. ఈ కవిత వెనుక వున్న బాధ, కోపం తెలిసాక రుద్రవీణలో పాట "చుట్టు పక్కల చూడరా చిన్నవాడా.." గుర్తుకొచ్చింది.
కవితకు జీవం పోసేది భావుకత,అభివ్యక్తి లో కొత్తదనం. అవి రెండూ మీ కవితలో ఉంటున్నాయి. దీనితో పాటు వస్తు వైవిధ్యం తోడయితే ఇంకా బాగుంటుంది. ఆ మధ్య "మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే/
నేనేమిటో ఇలా నీళ్ళలో గులకరాళ్ళు విసిరేస్తున్నాను/
మీరేమిటో అద్భుతాలు సాధిస్తుంటే/
నేనేమిటో ఇలా నీళ్ళలో మునుగుతూ, తేలుతూ మిమ్మళ్ని చూస్తున్నాను " అని చావా కిరణ్ కుమార్ గారు ఒక కవిత రాశారు. నిజానికి ఆ కవిత ఇంకా రాస్తే బాగుండును అనిపించింది. సందర్భం ..సంవేదన ఇలా అనేక దృశ్యాలను చూపాయా కవితా పాదాలు.దాని గురించి ఎంతయినా వ్యాఖ్యానించ వచ్చనిపించింది. ఆయన రాసిన పాత కవితలను ఒకసారి చూడాలనిపించింది. చాలా చదివాను. వీలు వెంబడిఆయన గారికి కామెంట్ రాయాలి. ఆకవితకి మీరు కూడా కామెంట్ రాశారనుకుంటాను. అన్నీ చదివి చావాకిరణ్ చాలా తెలివిగా కవితను ఎందుకు రాశారో చెప్పకుండా "Thank you Friends." అన్నారు. ఇదంతా ఎందుకంటే
మీ కవితల నేపథ్యాలను వివరించి, భావుకత పరిధిని తగ్గించకండి. వాళ్ళ అభిప్రాయాలను, ఆ కవిత చదివిన తరువాత స్వేచ్చ్గా అభిప్రాయాన్ని వ్యక్తం చేయనివ్వండి.
కవితను సాధారణీకరించే ప్రయత్నాన్ని చేయనివ్వండి. ఆ తరువాత మరీ అర్థం కాని స్థితిలో గానీ, లేదా మీ సన్ని హితులకు గానీ ఎందుకు రాశారో తెలపండి.
మీ కవితల గురించి మీ రు ఎమైనా చెప్పుకునే స్వేచ్చ, హక్కు మీకు ఉన్నాయి. కానీ... అంత మంచి కవితలను అంతే అందంగా ఆహ్లాదించగలిగేలా చే్స్తే...!
"మళ్ళీ మనిషిలా ఎప్పుడు మారుతావు?"
ప్రతి మనిషీ ఇటువంటి అనుభవం లోకి ఒకసారి తొంగిచూస్తాడేమో, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతోంది ఆ మార్పులు మనల్ని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి...బహుశా మనం మనలా ఉండగలిగినప్పుడు తప్పకుండా మనిషి మనిషిలా మారాలి అని మనం కొరుకోవాల్సిన సంధర్బాలు రాకపోవచ్చు అని అనలేను కాని తగ్గొచ్చు అని మాత్రం చెప్పవచ్చు.
పేకమేడలెపుడన్నా చూసావా?
నీటి రాతలెపుడన్నా రాసావా?
వాటి అనందం ఎంత సేపు?
నీకుతెలీదా?
edi naku chala baaga nachhindi.
daarla gaarU,
I am moved.
radhika garu
mee mail choosanu. thanks.naku meeto phone lo matladalani vundi.maa office no. istanu. mee email ID, mee phone no ceppandi. nenu meeto matladatanu.
office no:040- 27660173.
satyavati kondaveeti
అప్ నే ఆప్ కో క్యా సమజ్ రా? - బాగుందండి. ఇలా ఏదైనా సంఘటన చూసి దాని గురించి ఆలోచించి రాశారని తెలియకముందు ఇదేదో గోడు అనుకున్నాను. దార్లగారు అన్నట్లు ఇది కవిత పరిధిని తగ్గించడం అవుతుందేమో గానీ, మీతో ఈ కవితను రాయించిన నేపథ్యాన్ని చెప్పడంతో నాకు ఇందులోని భావం అర్థమైంది. కొన్ని అచ్చుతప్పులున్నాయి చూడండి. "పొద్దు"లో దీనికి పేరడీ భలే ఉంది.
radhika garu
Thanks for your reply.
my email ID is satyavatikondaveeti@gmail.com
satya
రాధిక గారూ,
దయ చేసి ఒక తెలుగు ఘజల్ వ్రాయ గలరు. మీ కవితల్లో అక్కడక్కడ పల్లవి/చరణాలు ఇప్పటికే ఉన్నాయి.
మీరు ఘజల్ వ్రాస్తే పాడుకోవాలని ఉంది.
కామెంట్ల రూపంలో ప్రోత్సాహాన్ని అందిస్తున్న మిత్రులందరికీ థాంక్స్.
దార్ల గారన్నట్టు కవిత వెనుక కధను వివరిస్తే భావుకత పరిధి తగ్గుతుందన్నమాట నిజమే.చాలా కవితలని పాఠకుల ఆలోచనలకు వదిలేస్తేనేమంచిది.సాంఘికంగా కొంత మార్పు ని ఆశించి రాసిన కొన్ని కవితలకి వాటి వెనుక విషయాన్ని వివరిస్తే చదివిన వారు ఆలోచిస్తారన్న చిన్న ఆశ. గొప్పగా రాయగలిగి చెప్పాలనుకున్న విషయాన్ని కవితలోనే చెప్పగలిగేవాళ్ళకి ఇలాంటి ముందు మాటలు,వెనుక మాటలు,వివరణలు అవసరం లేదు.కాని నాలాంటి వాళ్ళు రాసే కవితలు కి ఇలాంటివి అవసరమే అనుకుంటున్నాను.అయినా విషయాన్ని కవితలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను.అభిప్రాయాన్ని చెప్పిన దార్ల గారికి కృతజ్ఞతలు.
నాగరాజా గారూ నాకు ఘజల్ కుండే లక్షణాలు అది తెలీదండి.ఏదో మనసున పూసిన భావాలకు రూపమివ్వాలని ప్రయత్నమే గానీ నాకు నిజానికి కవితా లక్షణం కూడా తెలీదు.కొంత మంది పెద్దల పరిచయం తో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.ఒక స్థాయికి చేరిన తరువాత వాటిని కూడా ప్రయత్నిస్తాను.
రానారే నాకు అచ్చుతప్పులు కనిపించలేదు.[నిజంగా]
విహారిగారూ నాకు ఆలోచనలే రేషన్ లా గా వస్తున్నాయి.దేవుడికి ఒక మాట చెప్పి వాటిని పెంచమనండి.అప్పుడు కవితలు కూడా పెరుగుతాయేమో?
Radhika garu! next Kavitha eppudandi? :)
march ayyi.. may vachindi andi.... calender lo date lu martunnayyi.. gamanistunnara??
Chala pedda tappu jarigi pootondandi. rooju Udayaanne mee blog lo yedo oka kavitha, chadivina kavitha ninaa malli chadavandee, naa work start kaavatam leedu.
yee kavitha chala baagaa nachindandi... kaakapoote, taruvaata mee vivarana chadivitee, neenu anukunna bhaavaaniki mee bhaavaaniki quite difference...
Vasantam vellipooyena Daari vipe,
chustu niluchunna sisiram naa hrudayam.
talli,tandri,guruvu,divam annitini
sanyasinchi atuveepee chustoonna naa hrudayaanni...,
neenu kuda yelanee rooju prasnistu untaanu...
"neene gurtinchaleenantagaa
Neeku nuvve nachaleenantagaa..."
avunu, tanaku, naakantee, tanakantee... tana nichcheliyee(beloved) ekkuvipooyendi. antagaa tanatoo mudipadipooyendi.
maroo vasantam vundani cheppinaa, marennoo vishayaalanu aasa chupinaa chalinchani naa hrudayam, Chalam srustinchina 'Aruna'(small novel) koosam yeduru chustoondi...
tana nu rooju prasnistunee unaanu..
Manishila yeppudu Maartaaavani..???
Neelaa nuvvu yeppudu pudataavani..
Friends,,, meerinaa nachcha chepparuuu...
Radhika gaaru, mee prati kavitha nu aasvaadistunnanu,,, yentagaa antee maatram maatallooo cheppaleenu.
chala bagunnai madam
radhika garu.... neenu late ga chusanu....12/12/2010.. i really like way of your rightig
radhika garu... me kavithlu chala bagunnai.... please sneham gurinchi naku konni kavitalu pampagalara....? my email.id. appuhasini@gmail.com
radhika garu mee kavithalu naku manchi spoorthini ichvhayee.meeru ilanti kavithalu inka vraayali.
Post a Comment