Tuesday, June 24, 2008

స్నేహం

ఎంత పరుగులెట్టినా
తెలిసీ..ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం

ఎంత దూరమెళ్ళినా
గతంపై ఎన్ని రంగులద్దినా
అప్పుడప్పుడు తరచి చూసే పేజీ మన స్నేహం

52 comments:

pavan said...

mam u just inspired me by ur poetry very much thankful to u and hope u give us more poetry thank u

oremuna said...

Good one.

consider adding some labels / tags to your posts!

ప్రతాప్ said...

చాలా చిన్న పదాలు. కాని స్నేహం మొత్తాన్ని తమలో ఇముడ్చుకొన్న శిలాసదృస్యాలు..

Kranthi M said...

రాధిక గారు,
మీ పదాల్లో ఏదో శక్తి ఉందండి.నేను మీ కవితల నుంచి చాలా inspiration పొందుతున్నాను.నేను కూడా రాస్తున్నాను కాని నా కవితల్లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్.నా బ్లాగు చూసి can you suggest something (మీ ఫ్రీ టైం లో).

http://srushti-myownworld.blogspot.com/

Anonymous said...

నాని గారు సరిగ్గా చెప్పారు.

బావుందని ఇంకో సారి చెప్పనవసరం లేదనుకుంటాను.

నేనూ ఎన్నో సార్లు ఏదో కవితలు రాయలనుకుంటాను, కానీ ఎందుకో పదాలే గుర్తుకు రావు. చిన్నప్పుడు చదువుకున్న అమరకోశం, పెద్ద బాలశిక్ష మొదలుకుని, ఏమయాయో ఏమో?

Kathi Mahesh Kumar said...

మొదటి పఠనంలో చాలా బాగుంది.రెండో సారి చదివే సరికీ, మీరు చెప్పిన రెండో imagery లో కాస్త సమస్య ఉందనిపించింది.

గతంపై రంగులద్దిన తర్వాత, పేజీలని తరచి చూడడం పొసగలేదనిపించింది. రంగులద్దేది క్యాన్వాస్/తెర మీదకదా! మరి తరచి పుస్తకం పేజీలను ఎందుకు చూడాలి? అనిపించింది.

అలాగే మీరు "ఎంతదూరమెళ్ళినా.." అని రెండో అంకం ప్రారంభించారు. ఆ ఆలోచనని మొదటి అంకంలోనే ‘పరుగు లెట్టినా’అని దూరాన్నీ,దారుల్నీ కొలిచేసారు, ఇక రెండో సారికూడా అదెందుకూ? అనిపించింది.

నా తరఫునుంచీ ఈ (నా)సమస్యని ఇలా పూరించాను.

"ఎంత దాచినా
గతం పై ఎన్ని రంగులద్దినా
మనసు తెరపై మొదటిపొర మన స్నేహం"

Bolloju Baba said...

రాధిక గారు,
ఎలా కుదించేయ గలుగుతారండీ?
లేక, ఒక పేజీ కవిత వ్రాసి, ఒక్కొక్క పదాన్ని, మీరనుకున్న భావం చెడకుండా, తొలగిస్తు, తొలగిస్తూ, చివరగా మిగిలిన గుప్పెడు పదాల్ని ఇలా పోష్ట్ చెస్తారా?

మహేష్ గారి కోణం కూడా ఆలోచించదగ్గది గానే అనిపిస్తుంది. మీ వివరణ ఏమిటో చూడాలి మరి.

ఏది ఏమైనా మీ కవితలలో ఒక మిష్టిక్ ఆరా తొంగిచూస్తుంటుంది.
నేను ఇదివరకెప్పుడో మిమ్మల్ని చెయ్యితిరిగిన కవంటే మీకు కోపం వచ్చింది కానీ, అది నిజంగా నిజం.

బొల్లోజు బాబా

రాధిక said...

అభిప్రాయాలు తెలిపినవారందిరికీ ధన్యవాదాలు.మహేష్ గారూ అసలు మీరు కవికాదన్నవాడిని నేను కత్తితో పొడుస్తాను.ఇంత బాగా రాస్తూ నేను రాసేవి కవితలుకాదు మాటలల్లాను అంటారా?చాలాబాగా రాసారు.నేను రాసింది తీసేసి ఇది పెట్టాలని వుంది.ఎవరయినా దానికి అర్ధం చెప్పగలరేమో చూస్తాను.లేదంటే నేనే నా కోణం చెపుతాను.అపుడుకూడా అది పొసగనట్టనిపిస్తే అపుడు మీరు చెప్పినవి పెడతాను మీ పేరు తో సహా.మరొక్కసారి అందరికీ నెనర్లు.

Srividya said...

అన్ని తక్కువ పదాల్లో అంత మంచి భావాన్ని ఎంత బాగా చెప్పారండి. అందరికి అర్ధమయ్యేలా కవితలు రాయడం మాత్రం మీ నుండే నేర్చుకోవాలి.

ఏకాంతపు దిలీప్ said...

@ నా కోణం

దూరం అనేది ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చూ. పై ఖండికలో పరుగు ఉంది కదా అని దానితో అన్వయించుకోవడం సర్వ సాధారణం.
కానీ వేరే ఖండిక లా చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా దానిలోని వేరే అంశాన్ని గమనించగలగాలి. ఖండికలుగ చెప్పడంలో అదొ ఉద్దేశమని నేను నమ్ముతాను.

రెండొ ఖండికలో దూరాన్ని భౌతికమైన పరుగుతో అన్వయించకుండా... కాల గమనంతో, అన్వయించుకుంటే ఒక అద్భుతమైన భావం, దాచలేని నిజం ఉట్టిపడుతుంది నాకు.

ఇప్పుడు గడుపుతున్న జీవితం గతం నుండి ఎంతో దూరం.చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేని గతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా రంగులద్ది అసలు గతాన్ని మార్చివేస్తున్నా మనసు డైరీలొ దాచుకున్న మన స్నేహాన్ని మాత్రం అలా అంతటి స్వచ్చంగానే తరచి చూసుకుంటాను.ఆ గొప్పదనం మన స్నేహానికుంది.

మనలో చాలా మంది గతాన్ని తవ్వుకుంటున్నప్పుడు మనకే అనిపిస్తుంది... మనకు తెలియకుండానే మన గతాన్ని, మన గతంలో వ్యక్తులని కీర్తించడమో, భావోద్రేకంలోనో, భావ శూన్యతతోనో లేనిది ఉన్నట్టుగా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలా చేస్తున్నా కూడా మన స్వచ్చమైన, అమాయకమైన స్నేహాలకి అలాంటివి చెయ్యలేము.

తక్కువ మాటల్లో, మనకు తెలిసిన సాధారణమైన మాటల్లో చాలా విషయాలని కుదించెయ్యగలగడం రాధిక గారికి వెన్నతో పెట్టిన విద్య.

మంచి కవిత అందించినందుకు మీకు మరో సారి ధన్యవాదాలు. :-) దయచేసి దీన్ని మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యకండి..

Anonymous said...

రాధిక గారు,
మీ కవిత బాగుంది.అబినందనలు.
కవిత అన్నది మన మనసును ఏదైనా సంఘటన/జ్ఞాపకం రంజింప చేసినప్పుడు వచ్చే భావావేసమే.కానీ ఆ భావం లొ ఓకొక్కరకి ఒకొ రకమైన అర్ధం కనిపిస్తూ వుంటుంధి. మీరు మీ కవిత కి వివరన ఇవ్వటం అనవసరం అని నా అబిప్రాయం. గతం లొ కూడా వేరే ఎవరో ఇలాంటి సలహ ఇచ్హినట్టు గుర్తు. ఇంకొక్క విషయం కవితలు మీ అనందం గురించి మీకు తెలిసిన పదాలతొ రాస్తున్నానని ముందే చెప్పారు కదా మీరు ఎలా రాసినా ok.ఎందుకంటే కవితలని ఇలా ధిద్ధి,మార్చి,కొట్టివేసి చదివితే కవితా స్పూర్తి దెబ్బతింటుంది.(మహేష్ గారు క్షమించాలి)

ఆదిత్య

Purnima said...

రాధికా.. పదాలని ఇంత పొదుపుగా ఎలా వాడగలరండీ?? జైలులో పెడాతానని బెదిరించినా నా లొడలొడ ఆగదు. రాసిన ప్రతీ సారీ అదరగొట్టే వారిని ఏమనాలో ఓ రెండు ముక్కల్లో చెపితే.. నేర్చుకుని మిమల్ని పొగుడుతా!!

అయినా నాలాంటి వారికోసం ఓ క్రాష్ కోర్స్ పెట్టకూడదూ.. అప్పుడైనా బాగా రాస్తానేమో?? ;-(

Anonymous said...

"తెలిసీ..ఎన్ని దారులు మారినా"---

నాకు అర్ధం కాలేదు ...

Anonymous said...

"తెలిసీ..ఎన్ని దారులు మారినా"---

నాకు అర్ధం కాలేదు ...

మాలతి said...

అవునమ్మా, నిత్యజీవితంలో ఎన్నో దారులు తొక్కుకుంటూ పోతాం, గతానికి మనసూ బుద్ధీ ఎన్నిరంగులు క్షణక్షణం రంగులు వేసుకుంటూ పోతాయి. నిజంగా మనిషి కోరేది ఏమిటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే కావాలనిపించేది స్నేహం ఒక్కటే, అది అందించేది జ్ఞాపకాలొక్కటే. అద్భుతంగా చెప్పేవు. నాకు ఇన్నిమాటలు కావలసి వచ్చేయి, చూడు మరి.

నేను కూడా నీభావాలు నీమాటలలో చెప్పినప్పుడే రాణిస్తాయి అనుకుంటున్నాను.

నీఫొటో కూడా చాలా బాగుంది.

రాధిక said...

పవన్,ప్రతాప్ గార్లకు చాలా చాలా థాంక్స్.రవి,నాని గార్లు మీరు కూడా బ్లాగు మొదలుపెడితే బాగుంటుందేమో.
బాబాగారూ చెయ్యి ఎక్కువ తిర్గిపోయి నొప్పెట్టింది.అందుకని ఒక్కోసారి రాత మారుతూ వుంటుంది.అప్పుడు మీలాంటివారే హెచ్చరిస్తూవుండాలి నన్ను.
దీపూ గారు చాలా థాంక్స్.నా భావాలని పట్టుకున్నారు.
పూర్ణిమ మీలాంటి బ్లాగుడు కాయలు లేకపోతే మరీ జీవితం బోరుకొట్టేస్తుంది.మీరలాగే బ్లాగుతూవుండండి.మిమ్మల్ని జైల్ లో పెట్టకుండా చూసే పూచీ నాది.
ఆదిత్యగారు మీ అభిప్రాయానికి థాంక్స్.
శ్రీవిద్యగారు కామెడీ రాయడం మాత్రం మీనుండే నేర్చుకోవాలి.థాంక్స్.
చంద్రగారూ చూద్దాము ఎవరన్నా మీకు సమాధానం చెపుతారేమో?
మాలతిగారూ అసలు ఏమి చెప్పారండి.నాకవితకి వివరణ నేను ఇంత మంచి మాటల్లో ఇవ్వలేను.మీ కామెంటు నా కవితకు ప్రాణం పోసింది.మీకు వందల నెనర్లు.

రాధిక said...

మాలతిగారూ నా భావాలు నామాటల్లో చెప్పడం అంటే నన్నే వివరణ ఇమ్మనా మీ అర్ధం?ఒకవేళ అదే అయితే అచ్చూ మీరు చెప్పిన మాటలే నావివరణ.

మాలతి said...

లేదు రాధికా. నేను నిన్ను వేరే మాటలలో చెప్పమనలేదు. దయచేసి ఆపని మాత్రం చెయ్యకు. పైన వ్యాఖ్యలలో ఒకరు మార్పులు సజస్టు చేసారు, మరొకరు నీఅనుభూతి నీమాటల్లో వుంటేనే అందం అన్నారు కదా. అవి చదివినతరవాత తోచిన మాట రాసాను. దానికి నాస్పందన. అంతే.
నా వివరణ నీకు నచ్చినందుకు సంతోషం.

మాలతి said...

నేను సరిగ్గా రాయలేదు.ఆపని మాత్రం చెయ్యకు అన్నవాక్యం అనవసరం నావ్యాఖ్యలో.
నీకవితలు నకవితలుగానే నీకు స్ఫురించిన పదాలతోనో రాసినప్పుడు నీఅనుభూతి కవితలో కూడా ప్రతిఫలిస్తుంది అని అనడానికి ఇంత అవస్థ పడుతున్నాను. :))

Kathi Mahesh Kumar said...

రాధిక గారూ, నేనొక మంచి ఆస్వాదకుణ్ణి, కవిని అస్సలు కాదు (మీ మొదటి కత్తి పోటు నాకే అనుకుంటా).

నేను మీ కవిత చదివి ఆలోచించిన సమస్య నాది. As a reader I have a right to my own interpretation.That comes out of my experiences and thinking process. దాన్నే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించాను. అందుకే "(నా) సమస్యని" పూరించానే తప్ప,మీ కవితలో మార్పుని కోరలేదు. నా పూరణ మీకు నచ్చడం వేరే విషయం అనుకోండి.

ఇక మన దిలీప్ ఇచ్చిన వివరణ చాలా convincing గా ఉంది.

ఇక మిగతావాళ్ళు చెప్పినట్టుగా కాకుండా నా అభిప్రాయంకొంత వేరు. ఏ సాహిత్య ప్రక్రియలోనైనా మార్పు సహజంగా వస్తుంది, రావాలి. నేను రాసే మొదటి డ్రాఫ్ట్ కి ఫైనల్ డ్రాఫ్ట్ కీ తేడా ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పదాల్ని విడదీస్తాం, కొన్నింటిని కలుపుతాం, వరుసల్ని మారుస్తాం,అర్థాల్ని బేరీజుచేస్తాం అలా చెయ్యకపోతే అది మతగ్రంధ మవుతుందేగానీ, సృజనాత్మకమైన రాత అవ్వదు.The flow and change are the only constants in creative world.

Kottapali said...

రాధికా .. మీ కవిత్వం మీద ఒక్క కన్నే కాదు, రెండు కళ్ల నిలకడ గలిగిన నిశిత దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే మీ పైన బాధ్యత కూడా.
All the best.

Bolloju Baba said...

దీపు గారి వివరణ ప్రకారం - ఎంత దూరమెళ్లినా అనె కంటే ఎంత దూరమొచ్చినా అనే భావన బాగుంటుందేమో?

మహేష్ గారి ఇంటర్ ప్రెటేషను బాగుంది. దాని వివరణ ఇంకా బాగుంది.
బొల్లోజు బాబా

Subrahmanyam Mula said...

మంచి సరళత సాధించారు కవితలో! క్లుప్తంగా బావుంది.
ఐతే ఊహలు ఇంకా పదునుదేరాలి. మంచి కవిత్వం చదవండి.

swarupkrishna said...

మీ భావనా వ్యక్తీకరణ నిజంగా బాగుంది. ఇలాగే వెళ్ళండి..

నిషిగంధ said...

రాధికా, మొన్న వీకెండ్ అనుకున్నా 'మళ్ళీ మనసుకు పెట్టమని ' మీకు కబురంపాలని :-)
చదువుతూనే అర్ధమైపోయి, అర్ధమౌతూనే హత్తుకుపోవడం మీ కవితల గొప్పదనం.. చాలా బావుంది!! "మా స్నేహం" లో భావావేశం ఉంటే ఇందులో సరళత ఉంది..

Anonymous said...

bagundi radhika :)

bujjidi

వేణూశ్రీకాంత్ said...

రాధిక గారు quantity కన్నా quality ముఖ్యమని మీరు నిరూపిస్తున్నారండీ. నాలుగే మాటలలో ఎంతో అందమైన భావాన్ని పలికించారు... Hats off..

మేధ said...

ఎంత చెప్పినా,
చదివీ కామెంట్లు వ్రాయకపోయినా....
అలసినప్పుడు నేను చదివే బ్లాగు మీదే....
నేను కవితలు ఎప్పుడూ వ్రాయలేదు.. ఇది చెత్తగా ఉంటే వెరీ సారి.. కానీ నేను చెప్పాలనుకున్నది అర్ధమయ్యుంటుంది....

Ashok Chary Maheshwaram said...

radhika garu meeku nachina blog lo sirimalli ni kooda add chesuko galaru
ashok

videya said...

హై రాధిక,నేను మీ కవితలన్నీ చదివాను.దానికి మిగిలినవాల్లిచ్చిన స్పందన కూడా చూసాను.మొదటిసారిగ నన్ను నేనే మీలో చూసుకుంటున్నానా అన్న అనుభూతి నాకు కలిగింది.
నాగురించి మీకు తెలీదు కదూ.నా పేరు విధేయ.నేను పుట్టింది,పెరిగింది,విద్యాభ్యాసం గోదావరి తీరాన వున్న చిన్న పల్లెటూరులోనే.ఆ పల్లెటూర్లొనే జీవితాంతం మరిచిపోలేనన్ని
మధురమైన ఙ్నాపకాలను గొదావరి నాకు అందించింది.నాకు గోదావరితో వున్న అనుబంధం చాల గాఢమైనది.ఇంజినీరింగ్ పుర్తి ఐన తర్వాత గొదావరి పేరుమీదున్న కాలేజీలోనే
అసిస్స్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ రావడం నాకు అశ్చర్యంగాను,ఆనందంగాను అనిపించింది.తర్వాత ఇంజినీరింగ్లొ ఊనివెర్సిటీ గోల్డ్ మెడలిస్ట్,మంచి మిత్రుడు ఐన నా క్లాస్స్మేట్నే ప్రేమించి
పెద్దల అంగీకారంతొ పెల్లిచేసుకుని,తనతొ కలిసి ఇంగ్లాండ్ వచ్చేసాను.కాలేజి డేస్లొ నర్తకిగా,చిత్రకారినిగా,కవయిత్రిగా,గాయనిగా నాకు చాల ఫాన్ ఫాలొయింగే వుండేది.
ఏంతొమంది స్నేహితులు కూడా వుండేవారు.కానీ మనసు ఎప్పుడూ ఏకాంతంగా వుండడాన్ని ఇష్టపడేది,ఎవరితోను భావాలు తెలపలేని ఏదో అన్వేషణ వుంటూ వుండేది.అప్పటి నా కవితల్లో
అభ్యుదయ భావాలు,ప్రేమ,ప్రక్రుతి ప్రధాణాంశాలుగా వుండి యువతకు స్పూర్తిదాయకంగా వుండేవి.కాని ఇప్పుడు...నిర్లిప్తత ,విరక్తి,ఇదింతే దీన్ని ఎవరూ మార్చలేరు అనే భావన,
ఏదొ తెలీని వెలితి ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి.భాధ్యతలను భుజస్కంధాల మీద మొయవలసివచ్చినప్పుడు,కాళ్ళ చెప్పులు అరిగేలా ఉధ్యొగాల కొసం రొడ్ల మీద తిరుగుతున్నప్పుడు,
ప్రతిచోటా నిరాశ ఎదురై ఎదురుదెబ్బలు తగులుతున్నప్పుడు,కల్లముందే కారు చీకటి కమ్ముకుని ఆ నిశీధిలో వేకువకై కొట్టుమిట్టాడుతున్నప్పుడు,దహించే బాధలతొ గొంతు తడారిపోయి
బ్రతుకు భారంగా మారుతున్నప్పుడు కాల్ల కింద నేల ప్రకంపిస్తున్నట్లుగ అనిపిస్తుంటే.......అభ్యుదయం ఎక్కడ మిగిలివుంటుంది చెప్పండి?ప్రేమ,ప్రక్రుతి విక్రుతుల్లా కనిపిస్తాయి.
పది సంవత్సరాల క్రితం నా కవితలను ఇప్పుడు చదువుతుంటె నాకే వింతగా,అమాయకంగా అనిపిస్తాయి.బహుసా ఇటువంటి భావన చాలమందికి ఎదురయ్యే వుండవచ్చు.చదువుకునే రోజుల్లొ
నాకు తెలిసిన ప్రపంచం వేరు.అది చాల చిన్నది,చందమామ పుస్తకాల్లో శంకర్ వెసే చిత్రాల్లాగ అందమైనది,అద్భుతమైంది.కాని ఇప్పుడు నాకు తెలిసిన ప్రపంచం చాలా

విషాలమైనది,అయన్ రాండ్ రచనల్లా క్లిష్టమైనది.కాలంతోపాటు మనిషి ఆలోచనా విదానాలు మారతాయని,వాస్తవికతకు మరింత దగ్గర అవుతారని దానికి సాక్ష్యంగా ఆ మార్పు
నా కవితల్లొనే కొట్టొచ్చినట్లుగ కనిపించడం మొదలైంది.ఆ మార్పు మనసును కల్లోల పరస్తుంటే,సంఘర్షన భరించలేక హ్రుదయం ద్రవిస్తుంది.ఇప్పుదు నా కవితలు

చదివినప్పుడల్లా మా వారు ఏంటి ఈ విషాధం?ఇవి ఎవరన్నా చూస్తే నేను నిన్ను బాధిస్తున్నా నేమొ అనుకుంటారు అంటూ వుంటారు.నాకు నవ్వొస్తుంటుంది.చుసారా చిత్రం ,నేను వ్రాసిన
ద్రుక్పధం వేరు ఆయన చదివిన ద్రుష్టి వేరు.అలాగే ఒక కవిత ఉద్భవించిందంతే దానికి కారణమైన సంఘటన,ఆ తలపు కవి హ్రుదయానికి మాత్రమె తెలుస్తుంది.
చదివేవాల్లందరికీ తెలియవలసిన అవసరం లేదు.విమర్షనాత్మక ద్రుష్టి అనేది అన్ని సందర్భాలలొను వర్తించదు.ఒక పదాన్ని పలుచోట్ల పలు భావాలతో ఉపయోగించుకోవచ్చు.
భావ వ్యఖ్తీకరణలో ఇది ఇలానే వుండాలి అనే నియమం ఎక్కడా లేదు.కొన్ని కవితలకు వయొపరిమితి వుంటుంది,మరి కొన్నింటికి వయసుతొ సంబంధం లేకుండా అందరూ చదివి ఆనందించ
గలుగుతారు.ఇంకొన్నింటిని అర్ధం చేసుకోడానికి నిగూడమైన పరిఙ్ణనం,సునిసితమైన అవగాహన శక్తి అవసరం.మీ కవితలు రెండో కొవకు చెందుతాయి రాధిక.అందుకే చాల బాగుంటాయి.
మండుటెండలొ మజ్జిగ త్రాగుతున్నంత హాయిగా,చల్లగ....భారంగా,భొరుకొట్టించకుండా పిల్లగాలుల్లా మనసును తాకుతున్నాయి.మీరు ఇలాగే బొలెడన్ని కవితలు వ్రాసి మమ్మల్ని
అలరించాలని కొరుకుంటున్నాను.మహెష్ గారిలొని పదుణైన కోణం,దిలీప్ గారిలొని సునిసితమైన అవగాహన నాకు నచ్చాయి.మీరిరువురు కూడా మీ అమూల్యమైన కవితా పుష్పాలను అందిస్తే
వాటి పరిమళాలను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను....

Bolloju Baba said...

విధేయ గారి కామెంటు చదివాకా కవికి కవిత్వం కన్నా మంచి మిత్రుడుండడన్న నా అభిప్రాయం బలపడింది.

త్వరలో వారుకూడా బ్లాగులో తమ కవిత్వాన్ని వెలువరిస్తారని ఆశిస్తున్నాను.
బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

విధేయ గారి కామెంటు రాధిక గారి బ్లాగు సమీక్షలాగా చక్కగా అమరింది.This sounds like a testimony to the blog.

పనిలో పనిగా నన్నూ, "పదునైన కోణం" అన్నందుకు నెనర్లు.రాధికగారి కవితలు మమ్మల్నికూడా కవుల్ని చేస్తున్నాయోచ్!

MURALI said...

విదేయ గారి స్పందన చూసి అద్బుతంగా అనిపించింది. బ్లాగరులంతా కలిసి ఒక కొత్త లోకాన్ని సృష్ఠించినట్టుగా, దూరాలను చెరిపేస్తూ అందరూ కలిసి ఒక రైలు లోప్రయాణం చేస్తూ అనుభూతూలను, అనుభవాలను పంచుకొంటునట్టుగా ఎంత హాయి గా వుందండి. తెలుగు బ్లాగులు జిందాబాద్.
http://muralidharnamala.wordpress.com/

రాధిక said...

విదేయగారూ మీస్పందన చూసి నాకు చాలా ఆనందంగా వుంది.మీకవితలతో ఒక బ్లాగును మొదలుపెట్టే సమయం వచ్చింది.ఆలస్యం చెయకుండా ప్రారంభించండి.సో మీరు గోదావరివారన్నమాట.అదేమిటో గోదావరి బీడువారిన నేలనే కాదు,తడారిన మనసుల్లోకూడా చెమ్మని తెప్పిస్తుంది.నిజమే అమితానందం కలిగినా,భరించలేని బాధకలిగినా అక్షరాలు మంచి స్నేహితులవుతాయి.కాబట్టి ఇప్పుడు మీరు మీభావాలకు అక్షర రూపం ఇవ్వండి.
దిలీపుగారు,మహేషు గారు ఇద్దరూ కవితలు రాస్తున్నారు.వారి పేరు మీద క్లిక్ చేస్తే మీరు వాళ్ళ బ్లాగులకు వెళ్ళొచ్చు.
మీరిలాగే నాకవితలు చదువుతూ స్పందన తెలియచేస్తారని ఆశిస్తున్నాను.మరొక్కసారి మీకు ధన్యవాదాలు.

రాధిక said...

మాలతిగారూ అర్ధమయిందండి.
సుబ్బుగారూ మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది.మంచి కవిత్వం చదవడానికి తప్పక ప్రయత్నిస్తాను.
మేధ గారూ చక్కగా చెప్పారు.థాంక్స్.
నిషి,వేణు,అషోక్,బుజ్జి,స్వరూప్ మీ స్పందనకు థాంక్స్.
కొత్తపాళీ గారు నిజమే బాధ్యత చాలా పెరిగిందనిపిస్తుంది.ఆ భయంతోనే తరచుగా రాయలేకపోతున్నాను.
మహేష్ గారూ మీరు చెప్పినదానితో ఏకీభవిస్తున్నాను. :)
మురళి గారు నిజమే ఇదొక కొత్త లోకం.

రాధిక said...

కిరణ్ గారూ ఈసారినుండి టాగ్స్ పెడతాను.
బాబా గారూ మీరన్నది 100% నిజం.
\మహేష్ గారూ నా బ్లాగ్సమీక్ష చాలాబాగుంది కదా.ఇది నిజంగా నా అదృష్టం.

వర్మ said...

రాధిక గారు ,
చాలా బాగుందండి. అన్ని కవితలు మనసు లోతుల్ని తడుతూ వ్రాసినవే. ఈ రోజే తొలిసారిగా మీ బ్లాగ్ విజిట్ చేసాను. ఇకముందు రెగ్యులర్ గా విజిట్ చేస్తాను.

జాన్‌హైడ్ కనుమూరి said...

http://johnhaidekanumuri.blogspot.com/2008/06/blog-post_14.html
మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు - "స్నేహమా" బ్లాగ్సమిక్ష
published in poddu.net

Anonymous said...

రాధిక గారు, మీకు ఎలా కృతఘ్నతలు చెప్పాలో అర్థం కావటం లేదు..
ఇప్పుడిప్పుడే ఈ బ్లాగ్ ప్రపంచాన్ని చూస్తున్న నాకు మొదట్లోనే మీ బ్లాగ్ ను చూసే అదృష్టం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది..
ఎన్ని కవితలు.. ఎన్ని కామెంట్లు.. ఆహా!! చాలా చాలా సంతోషం..

Chakradhar said...

marii inni comments aa ??

kavita ainaa baavundaali .. lekunte readers ainaa ekkuva undaali ne way ...


enjoy

Chakradhar
http://www.chakradhar.net

spandana said...

మీ మిగతా కవితలకంటే ఇదేమంత అడ్బుతమైంది అనిపించలేదు. మహేశ్ గారన్నట్లు చదువుతున్నప్పుడు నా భావప్రవాహం రెండో ఖండికలో తెగినట్లనిపించింది. అయినా నా గత సలహాకే కట్టుబడివున్నా. మీ వూహను వివరణలతో పలుచన చేయకండి. పాఠకులూ తమ తమ వూహల్ని, అనుభవాలనీ, బాధల్నీ, భావాల్నీ అందులో చూసుకోనియ్యండి.

-- ప్రసాద్
http://blog.charasala.com

ఆనంద ధార said...

రాధిక గారు.. మీ కవితలు చాలా బాగుంటాయి. మీ కవితల్లో చాలా వాటిని చదివాను. చాలా సింపుల్ గా ....వున్నా ....భావాన్ని ...మరియు అందులోని సారాన్ని ...చదివేవారి కి మీరు మీ కవితల్లో అందివ్వ గలరు అనిపించింది.. మీ కవితలు చదివాక... కాని నేను బాగా గమనించిన విషయం ఏమిటంటే మీ కవితల్లో ఎక్కువ శాతం జీవన సరళి , ప్రకృతి, అనుబంధాలు, బంధాలు, దర్శనమిస్తాయి. మీరు సామాజిక అంశాలపై కూడా మంచి కవిత్వాన్ని రాయవలసిందని నా మనవి.

Anonymous said...

hi radhika... ur poyetry is fine to read

Anonymous said...

baagundadi.ee madhya aa kavitvam chadivinaaaa ekkadoo inatkamunde chadivina feel vachhedi kani edi fresh ga vundi

Rama Deepthi Muddu said...

nice one.. i missed a lot of stuff here...
keep posting..
luv
JOSH

Anonymous said...

రాధికాగారూ, ఈ మధ్య బ్లాగులకి కొద్దిగా దూరమై మీ కవితలు చాలా మిస్ అయినట్లున్నాము.కొత్త కవితలు చాలా చాలా బాగున్నాయి.బొమ్మల స్టైల్ మార్చినట్లున్నారు .ఇంకా బాగున్నాయి.
నూవుశెట్టి బ్రదర్స్

devi said...

రాధిక గారు మీ కవితలు బావున్నాయి.ఫొటోలు ఇంకా బావున్నాయి.

pavan said...

hi mam just with a few words u just described friendship and the beauty of telugu remains with its simplicity and its great

Anonymous said...

రాదిక గారు.నా బావాలని మీ కవిత లలొ చూసుకుంటున్నాను.చాలా బాగున్నయీ మీ కవితలు

Anonymous said...

u r poetry is very heart touching radhika garu u r very nise mom

Unknown said...

radhika garu mee kavitvam bavundi.nenu kaviyitrini kadu kaani naku ishtamaina vakyalu naku thatti napudu nalo kavi hrudayam niduralestuntindi, avi na diary lo rasukuntanu.inka ekkadaina manchi vakyalu kaani, patalalo lyrics kaani baga anipiste avee add chesukuntanu.na diary nakoka treasure lantidi.
videha gaaru mee comments choosina tarvata nijanga chaala happy ga anipinchindi.naaku chalasarlu mee lanti feelings ee kalugutayi,kaani na alochana drukpadam lo ne theda undi anukunnanu, nala alochinchevaru inkaa unnarani thelisi chala santoshamesindi.

Maro Prapancham said...

HI RADHIKA GARU,
UR POETRY IS VERY NICE I HAVE SEEN MANY BLOGS BUT I DIDNT FIND THE CORRECT ONE NOW AFTER SEEING UR POETRY I AM VERY MUCH SATISFIED....THANK U
I HOPE U WILL WRITE MANY MORE...BYE