Friday, July 18, 2008

పాట - 1



నువ్వురాక ఎవ్వరున్నా
ఒంటరవుతాను ఎందుకో
నిన్నుచూస్తే నన్నునేనే
మరచిపోతాను ఎందుకో
కనులముందుకు నేరుగా
నేరాను అంటావు ఎందుకో
కలతనిదురలొ కలలాగా
వెనువెంటవస్తావు ఎందుకో
ఎందుకో ఓ ఓ..

నిదురనే మరచి నా కన్నులే
అలసినా వేచెనెందుకో
తలపులో నిలచి నీ రూపం
గుండెనే తట్టెనెందుకో
ఈలోకం వెలివేసినా
నీకోసం ఎదిరించనా
ఈలోకం వెలివేసినా
నీకోసం ఎదిరించనా
చెలియా చెలియా నువ్వుగా వలచి నన్నిలా వదిలావెందుకో ఎందుకో....

చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో
ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసినా
పూవల్లే నినుచూడనా
మనసా మనసా మాటలే మరచి మౌనమే నేర్చినావెందుకో ఎందుకో....

చిత్ర :- పృధ్వీ వర్మగారు
స్నేహితుని ట్యూన్ కి రాసిన నా మొదటిపాట.

32 comments:

ఏకాంతపు దిలీప్ said...

మీ పాటకి మొదటి ప్రేక్షకుడుని నేనే... పాట బాగుంది... మీరిలానే కవితలతో పాటూ మరిన్ని పాటలు రాయలని కోరుకుంటున్నాను... :-)

bujjidi said...

wowo bagundi radhika :)

Anonymous said...

"చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో"
బాగుంది. పనిలో పనిగా ఆ ట్యూను కట్టిన పాటని కూడా పెడితే పోలా?

Kathi Mahesh Kumar said...

ట్యూన్ తెలిస్తే ఇంకా బాగుంటుందేమో!

Kranthi M said...

ఏమ౦డీ ఆ పాటేదో కూడా మీరే పాడేసి ఆ ల౦కె ఇస్తే ఆన౦దిస్తా౦.ఏమిటీ చాలా రోజుల తరువాత రాసారు.చాలా బాగు౦ది.

Kranthi M said...

’ఏగాయం నువుచేసినా
పూవల్లే నినుచూడనా’
చిన్నవే గానీ ఎక్కడో తాకుతున్నాయ౦డీ ఈ మాటలు.

Bolloju Baba said...

pl. post the song/link of the song if possible
bollojubaba

వేణూశ్రీకాంత్ said...

పాట చాలా బాగుందండీ... 2 వ చరణం మరీ బాగుంది. పైన అందరు అడిగినట్లు మీరే పాడేసి ఆడియో లింక్ కూడా ఇచ్చేయండి.

Anonymous said...

"కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో"
నచ్చింది simply superb

Anonymous said...

"కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో"
నచ్చింది simply superb

జాన్‌హైడ్ కనుమూరి said...

Congrats for attempting the song

నేరానంటావు ఎందుకో
కలతనిదురలొ కలలాగా
వెనువెంటొస్తావు ఎందుకో

ఇలావుంటే బాగుండేదేమో
అయిన ట్యూనులోని గాప్ ఇంపార్టెంటు కదా!

సుజాత వేల్పూరి said...

ట్యూన్ ని కూడా పెట్టండి రాధికా! అసలు పల్లవి చాలా బాగా మొదలైంది. నిజంగానే చినుకులా తడిపింది మనసుని.

Anonymous said...

చాలా బాగుంది రాధికా గారు,నన్ను వదిలిన
నా ప్రేమ గుర్తుకొచ్చినది

చైతన్య.ఎస్ said...

చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో...నాకు బాగా నచ్చింది. చాలాబాగుంది మీ పాట.

Anonymous said...

అభిప్రాయాలు తెలిపి అభినందించినవారందరికీ నెనర్లు.ఈ పాట ట్యూను ఆయన ఒక సినిమాకి ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అది నేను ఇక్కడ ఇవ్వడ0 బావ్య0 కాదని్ ఇవ్వట్లేదు.అయినా అతి తొందరలో మీరందరూ ఆపాటని సినిమాలో వినబోతున్నారు.దేవుడు దయతలిస్తే నా ఈ లిరిక్స్ తో సహా సినిమాలో వినొచ్చు.ఈపాటలో కొన్ని పదాలు అవసరమ్ లేని చోట్ సాగదీయబడి,కొన్ని చోట్ల నొక్కబడి వుంటాయి.అదంతా ట్యూను లో ఫ్రేమ్ చేయడానికని గమనించగలరు.చాలా వాక్యాలు,పదాలు విన్నవాటిల్లానే వుంటాయి.సంగీత దర్శకుడు ఇచ్చిన సందర్భానికి,ఆయన కోరిన భావాలకి,పదాలకి ,ఆయన చేసిన ఎడిట్ల తరువాత బయటకు వచ్చిన పాట ఇది.కాబట్టి అందరూ అర్ధ0 చేసుకోగలరు.ట్యూనుకి తగ్గట్టు రాయడంలో కష్టాలు మొదటిపాట కే తెలిసిపోయాయి.సందర్భ0,భావ0,ట్యూను,పదాలు,వాక్యాలు,దర్శకుడి ఆమోద0, ఇన్ని హద్దుల మధ్య పాటరాయాలి అని తెలిసేసరికి నా మా సిరివెన్నెల గారి మీద అభిమానమ,గౌరవ0్ పదింతలు పెరిగిపోయాయి. నా మొదటి ప్రయత్నాన్ని మెచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.

నిషిగంధ said...

పాట ఆసాంతం చాలా చాలా చాలా...... బావుంది రాధికా! ఇప్పటికే చరణాలని నాకొచ్చిన ట్యూన్ లో పాడేసుకుంటున్నాను.. నిజంగా ఒక పాట మన చెవులకి వినబడే ముందు ఎన్ని పరీక్షలకి తట్టుకుని రావాలో కదా.. మీ పాట వాటన్నటినీ అవలీలగా దాటేసి, వెండితెర మీద మీ పేరు త్వరలో కనబడబోతుందన్న విషయంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదు.. Wish you the BEST!

Anonymous said...

ఈ పాట ఆర్పీ పట్నాయక్, కీరవాణి, రమణ గోగుల,చక్రి కలిసి పాడితే చాలా బాగుంటుంది (ఆ నలుగురికి)

Aditya said...

రాధిక గారు,
మీ పాట మొదటి ప్రయత్నం లొనే సినిమాలొ వినిపించాలని నేను ఆశిస్స్తున్నా.
మీ కవితల్లాగే చాల సులువుగా పాడుకొవడానికి వీలుగా వుంది.Tune కుడా బావుంటుందని అనుకొంటున్నాము.

మీరే మొదటి బ్లాగర సినీ పాటల కవయుత్రి అన్నమాట

అబినందనలు.

ఆదిత్య కొడూరి.

Anonymous said...

హాలో రాధికా, నిన్న పెట్టిన మాట కంప్యూటరు తినేసినట్టుంది. :)
సినిమారంగ ప్రవేశం చేస్తున్నందుకు నాహృదయపూర్వక శుభాకాంక్షలు.
మాలతి

మేధ said...

రాధిక గారూ, సినిమా రంగ ప్రవేశం చేస్తున్నందుకు శుభాభినందనలు...

చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో

ఇది చాలా నచ్చింది నాకు..

Kottapali said...

impressive. good job.

Kottapali said...

బాగా రాశారు రాధికా.
"ఎందుకో" ల డోసు కొద్దిగా ఎక్కువైంది, కానీ పర్లేదు.

గుండెనే తట్టెనెందుకో .. ఇది కొంచెం మార్చొచ్చు.
కలతనిదురలొ కలలాగా
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో .. ఇవి నిజ్జంగా బావున్నై

ప్రతాప్ said...

ఈ పాటని "మన్మధుడు" సినిమా లోని "చెలియా చెలియా" ఆ ట్యూన్ లో పాడేసుకుంటున్నాను. నాకు పాడటం రాకపోయినా సరే నా చుట్టూ వున్న జనాలని చావగొడుతున్నాను. అందరు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు (just kidding).

బావుంది అన్నమాట చాలా చిన్నది. అందుకోండి తొలి బ్లాగరి సినీ కవయిత్రి గారు మా హార్ధిక శుభాకాంక్షలు.

కల said...

బావుంది. మీ కవితల్లానే చాలా అమాయకంగా, simple గా ఉంది.

కొత్త పాళీ said...

సింపుల్గా లేదు, తగినంత చిక్కదనంతోనే ఉంది.
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో .. అన్న ఊహ సామాన్యమైంది కాదు.
రాధికా అభినందనలు. కాళ్ళు ఎలాగా తడీ చేసుకున్నారు కనక (మీ పాట నిండా అన్నీ నీఈళ్ళే! :)) ఇక ఇలాగే ప్రొసీడాఇపోండి.

Pradeep Palem said...

కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో...

ee line bagundi..good..All the best to your cini career..

సుజ్జి said...

radhika garu, congrats! meeru ee paata tho cine ranga prevesham chestunnaru anna maata.
but, if u dont mind, mee paata lo konni lines
aedo jandhyala cinemalo naresh and poornima la madhya teesina song gurthuku vastundi(i think naalugu stambaalata..)
but ofcourse, cinema paatalu aela ne untai kaabolu...vakelaaga... anyways, all the best and congrats!!

Anonymous said...

నిషి,ఆదిత్యగారూ నెనర్లు.

మాలతిగారూ,మేధగారూ మీకు కూడా నెనర్లు.

జజ్జనక :) గారూ "ఎ0దుకో"లు నిజ0గానే ఎక్కువయ్యాయి.కానీ ఏమిచెయ్యను ఆయన పాట అలా ఇఛ్ఛారు.పాట0తా నననానానా అని పాడి మధ్య మధ్యలో ఎ0దుకో అ0టూ పాడారు.అలా చివర్లో ఎ0దుకోలు పెట్టి అల్లాల్సివఛ్ఛి0ది.

ప్రతాప్ గారూ చెలియా చెలియా ట్యూన్ లో ఇదసలు కలవట్లేదుగా.మీరన్నాకా చాలా ట్రై చేసా.చూస్తూ ఉ0టే మీరు పెద్ద పాటగాడిలా వున్నారు:)

కలగారూ నిజమా...థా0క్స్.

కొత్తపాళీ గారూ మీ ను0డి అభిన0దనలు నాకు బోలెడు ఉత్సాహాన్ని ఇస్తాయి.ఇప్పటి కాళ్ళ తడి పిల్లగాలికి ఆరిపోతు0ది.ఈ తడి నిలవాల0టే నేను తడుస్తూనే వు0డాలి.

ఛ0ద్ర గారు థా0క్స్.

సుజ్జి ఆ పాట. ఏమిటో ఎ0త చి0చుకున్నా గుర్తురావట్లేదు.ఒకసారి ఆ సినిమా చూడాల్సి0దే.తెలియచేసిన0దుకు థా0క్స్.ఈసారి ను0డి అలా జరగకు0డా చూసుకు0టాను.

ఇ0తకీ చెప్పేదేమిట0టే ఆయనేదో సినిమాల్లో ప్రయత్నిస్తున్నారు ఈ ట్యూనులను పట్టుకుని అ0తేన0డి.ఇప్పుడు ఆయనేవో షార్ట్ ఫిల్మ్స్ కి చేస్తున్నారు.ఈ ప్రేమ పాటలకి ,ఆ షార్ట్ ఫిల్మ్స్ కి చాలా దూర0.కానీ ఇలా0టి సిట్యూవేషన్స్ సినిమాల్లో కోకొల్లలు కాబట్టి ఛాన్స్ వస్తే ఆపాటని యధాతధ0గా వాడుతానని చెప్పారు.అ0దుకే అన్నాను దేవుడు దయతలిస్తే అని.మరొక్కసారి అ0దరికి థా0క్స్.

Aditya said...

తప్పదు ప్రతీ మనిషికీ ఎదో ఒక స్టేజీ లో "అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను" ఈ అనుభవం.ఎప్పటిలాగే మంచి కవిత రాసారు అభినందనలు

Santosh Reddy said...

ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసినా
పూవల్లే నినుచూడనా.....

ee aksharaalu eppatiki marchipolenu....ilanti animuthyalani maatho meeru panchukunnadhuku meeku runapadi untaanu.....thanks....

Unknown said...

Chala baga rasaru medam

Augustus.Augustya said...

ట్యూన్ వినాలని ఉంది