Saturday, July 19, 2008

పశ్చాత్తాపం


బాల్యంలోనే ఎప్పుడో ఎక్కడో
పారేసుకున్న మానవత్వాన్ని,
అప్పుడే అక్కడే...
కావాలని వదిలేసుకున్న విలువలని
ఇన్నాళ్ళకి వెతుక్కుంటున్నాను

సముద్రంలా వ్యాపించిన
స్నేహితుల సమక్షంలో
ఒంటరినై ఉసూరుమంటూ,
ఊరి పొలిమేరలో ఆఖరి అడుగుకి
అప్పచెప్పిన ఆత్మీయతలని
ఆశగా ఆహ్వానిస్తున్నాను

నన్ను నేను గుర్తుచేసుకోవడానికి
గతాన్ని తరచి చూసుకుంటున్నాను
చిత్ర౦ :- పృధ్వీ వర్మగారు

32 comments:

వికటకవి said...

మీరు వాడాలనుకున్న పదం బాల్యమేనా అని అనుమానం. ఎందుకంటున్నానంటే, బాల్యానికి, మానవత్వానికి పొత్తు కుదరదేమో అని సందేహం. ఆడి పాడే వయసులో అంతలేసి పదాల అర్థాలు, విలువలు ఏం తెలుస్తాయి.

ఏకాంతపు దిలీప్ said...

రాధిక గారు చాలా బాగుందండి...

వికటకవి గారూ... ఇప్పుడు బాల్యంలో లేము కదండీ... అప్పడు మనకి అమాయకత్వం ఉంటుంది, దాన్ని అమాయకత్వం అంటారని తెలియదు... వెనక్కి తిరిగి చూసుకుంటే, అప్పుడు మన స్వభావంలో ఒక లక్షణానికి అమాయకత్వం అని ఇప్పుడు పేరుపెట్టుకుంటాము... ఏ భేద భావాలు లేకుండా అందరితో ఒకేలా ఉండే, అన్నిటికీ ఒకేలా స్పందించే చిన్నప్పటి ఒక లక్షణానికి ఇప్పుడో పేరు పెడితే దాన్ని మానవత్వం అనొచ్చు కదా... అమాయకత్వం ఎలానో, మానవత్వం కూడా అలానే...

ఈ కవిత బాల్యంలో ఉన్న చిన్న పిల్ల రాసింది కాదు కదా... ఒక యువతి వెను తిరిగి చూసుకుని, చేసుకుంటున్న ఆలోచనలోనుండి పుట్టింది... ఆ కోణంలో చదివితే ఆ ప్రశ్న రాదేమో అనిపిస్తుంది నాకైతే...

sujji said...

radhika garu... kavitha simply super!!!
chala baaga raasaru. chadavagaane nachindi.! really very nice and touching.. !
thanks for the poem...

మోహన said...

చాలా బాగుంది రాధిక గారూ..

simple fact

Anonymous said...

నన్ను నేను గుర్తు చేసుకోడానికి.. చాలా బాగుంది. పశ్చాత్తాపమేముంది, ఏదో సమయంలో వెనక్కి తిరిగి చూసుకోవాలన్న కోరికే గొప్ప అనుభవం.
అభినందనలు.

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది రాధిక గారూ... గతాన్ని తరచి చూడటం పై నాలో మెదిలే అస్పష్టమైన ప్రశ్నలకి జవాబు దొరికినట్లు గా అనిపించింది... చాలా థాంక్స్.

కొత్త పాళీ said...

వికటకవి, ఆ వయసులో పదాలకి అర్ధాలు తెలియక పోవచ్చు గాని ఆ భావాలు (మనం సాధారణంగా మానవత్వానికి గుర్తింపుగా ఊహించుకునే లక్షణాలు) నెలల పిల్లల్లో కూడా బలంగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.

పూర్ణిమ said...

Interesting!!

vikaTakavi said...

బాల్యం, అమాయకత్వం కాంబినేషన్ ఎక్కువ విన్నా, ఈ కాంబినేషన్ కొత్తగా ఎప్పుడు విన్నట్లనిపించలా. అందుకే అడిగాను.

మేధ said...

>>సముద్రంలా వ్యాపించిన
స్నేహితుల సమక్షంలో
ఒంటరినై ఉసూరుమంటూ
true....
చాలా బావుంది రాధిక గారు..

కల said...

ఒక్క లైన్ నన్ను బాగా తాకింది రాధిక గారు,
"నన్ను నేను గుర్తుచేసుకోవడానికి
గతాన్ని తరచి చూసుకుంటున్నాను."
నిజమే కదా? మనం మనల్ని మర్చిపోకూడదంటే మనల్ని మనం తరచి చూసుకొంటూనే ఉండాలి.

బొల్లోజు బాబా said...

రాధిక గారు
మీరు నాకవితకు వ్రాసిన కామెంటుని చదివి చాలా చాలా కంగారు పడిపోయాను.


కొన్ని పదచిత్రాలు, మరికొన్ని వివరణలు మినహాయిస్తే రెండు కవితలలోని సారాంసము ఒక్కటేనని అనిపిస్తుంది.
అది మనిషి పుట్టినప్పుడు కలిగిఉన్న మానవత్వాన్ని క్రమక్రమంగా మరచిపోతున్నాడు అనే కదా. ఎదో ఒక సందర్భంలో మనల్ని మనం తరచిచూసుకొంటే ఈ విషయం అవగతమవుతున్నదని కవితల ఉద్దేశ్యం.

ఇక పోతే ఈ కవితలో మీదైన బ్రెవిటీ మార్కు అద్బుతంగా చూపించారు.
చాలా బాగుంది.
చిన్న డౌటు. వికట కవి గారి ఆక్షేపణను కొంచెం ఆలోచించదగ్గదే అని నా అభిప్రాయం. బాల్యం తరువాతే మనలోని విలువలు కానీ మానవత్వం కానీ మసకబారే పరిస్థితులు వస్తాయని భావిస్తాను. దిలీప్ గారి వివరణ ప్రకారం సరిపెట్టుకోగలను. అన్యధాభావించరనే తలుస్తాను.

బొల్లోజు బాబా

Chandra said...

" బాల్యం లొ నే " కంటే "బాల్యం తొ నే " అయ్యుంటే బాగుండేదేమొ..

J-O-S-H (My Bench !) said...

tooooo good radhika garu.
very interesting comments section too!
"kaavalani vadilesina viluvalani", "samudram la vyapinchina snehitulani"," oori aakhari aduguku appacheppina atmeeyatalani"..
nice phrases!
nice profile picture too! and very nice additions to ur blog..

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది. కానీ...నాకూ ఆ బాల్యమే కాస్త పంటికిందరాయైంది.

బుసాని పృథ్వీరాజు వర్మ said...

పరిచయ పేజీ ప్రతీపుస్తకానికి అవసరమే. పరిచయజ్ఞాపకం ప్రతినేస్తానికి ఒక చక్కటి అనుభూతి. కాలంలోనూ ఆత్మీయతలోనూ దూరమై మన జ్ఞాపకాల్లో దగ్గరై తరుచు వారిని గుర్తుకుతెచ్చుకోవడం చాలా బావుంటుంది. మీ కవితాచిత్రము బావుంది.

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

"సముద్రంలా వ్యాపించిన
స్నేహితుల సమక్షంలో
ఒంటరినై ఉసూరుమంటూ.."
మేధ గారికి లాగానే నాకూ ఇది చాలా బాగా నచ్చింది.
ఈ కవితలో, బాల్యం అంటే చిన్నప్పుడనికాకుండా పరిణితి చెందని మనసుగా నాకనిపించింది.

మురారి said...

>>నన్ను నేను గుర్తుచేసుకోవడానికి
గతాన్ని తరచి చూసుకుంటున్నాను.

baagaa raasaaru.

bujjidi said...

నన్ను నేను గుర్తుచేసుకోవడానికి
గతాన్ని తరచి చూసుకుంటున్నాను

baagundi radhika :)

-bujjidi

రాదిక బుజ్జి said...

రాధిక గారు,
చాలా బాగుంది
"తిరిగి రానిది మరచిపొలేనిది ’బాల్యం"
దేవుడు వరమిస్తే నా మొదటి కొరిక నా బాల్యన్ని నాకు తిరిగి ఇవ్వమంటాను.

win said...

meeru rasina ee kavitha nanu chala baganachidi

Nagabhushanam N said...
This comment has been removed by the author.
Gems Of Hindupur said...

radhika gaaru... telugulo best blog meede... indulo ee matram doubt ledu... naa browser book marks lo mee blog vuntundi, atleast 2days ki okkasaaraina ala click chesi choosthoone vuntanu

Aditya said...

సారీ రాధిక గారు,
వేరే పనుల్లొ వుండటం వుండటం వలన ఈ కవిత కి టపా ఇవ్వలేకపొయను.
ఒక్కసారి అందరని బాల్యం లొకి తీసుకెల్లగలిగారు.తిరిగి వెల్లలేము అని తెలిసినా మల్లీ వెల్లాలనిపిస్తుంది.
ధన్యవాదములు.
ఆదిత్య

విహారి(KBL) said...

రాఖీ(శ్రావణ పూర్ణిమ) శుభాకాంక్షలు రాధిక గారు.

videya said...

బాగుంది రాధిక.మనసుకి హత్తుకుంది.దిలీపు గారు ఎప్పటిలాగే వారి చాతుర్యాన్ని ప్రయోగించి కొందరిని సమాధానపరచాలి అనుకున్నారు .కాని బాల్యానికి ,మానవత్వపు విలువలకి పొత్తుకుదిరినట్లుగా అనిపించడంలేదు.

Anonymous said...


thanks

Ricky said...

Hi this is ........
But your poet is simply superb
and very interesting
why can't u write a book.
for those who r out of Indian (Telugu people)

Ricky said...

nenu meru rasina thammudu kavithanu chdivanu
oka skhenam meku thamudiga ...................

S said...

"సముద్రంలా వ్యాపించిన
స్నేహితుల సమక్షంలో
ఒంటరినై ఉసూరుమంటూ,"
- Thats life! "జగమంత కుటుంబం నాది...ఏకాకి జీవితం నాది" అన్నట్లు అనిపించింది :)

Naani said...

Hi Radhika garu chaala bagundhi...

raghavendra said...

radhika garu very nice andi. simply super now adays there is no time to memorize the childhood and village climat...but some articles,very few films and your poetries are fulfilled.thank you radika garu keepit up.