ఓయ్ బుజ్జమ్మా ...
అక్కడక్కడ అడ్డం పడుతుంటే తిట్టుకోవు కదూ!
నువ్వూ నేనూవున్న గదిలో
చిందరవందరగా కొన్ని జ్ఞాపకాలు వదిలిపెట్టాను
బట్టల అల్మారాలో
ఫొటోలతో పాటూ కొన్ని నవ్వులు దాపెట్టాను
ఆ ముందు గదిలోని సోఫాలో
ఎన్నెన్నో మాటలు వదిలిపెట్టాను
అప్పుడప్పుడూ
అక్కడక్కడా అడ్డంపడుతుంటే తిట్టుకోవు కదూ!
1 comment:
చాలా బాగుంది.
Post a Comment