Wednesday, March 18, 2020

ఉండిపోరాదే

బుజ్జమ్మా ...
నిన్ను పంపటం నాకెప్పుడూ కష్టమే !
ముసురు పట్టిన ఆకాశం లా
మనసంతా దిగులేదో కమ్ముకుంటుంది!
కళ్ళు తడి మేఘాలై 
గొంతులో ఏదో అడ్డం పడినట్టనిపిస్తుంది!
ఊరెళుతున్న అమ్మని చూసి 
కాళ్ళకడ్డంపడుతూ ఏడ్చే బిడ్డలా
నిన్ను ఆపేయాలనిపిస్తుంది !
నాతో ఉండిపోడానికి
అసలేమౌతావన్న ప్రశ్నేదో
ఒక్కసారిగా లోకంలోకి తెచ్చిపడేస్తుంది !
కానీ మళ్ళా వస్తాననే నీ భరోసా  మాత్రం 
ఎన్నాళ్ళైనా ఎదురుచూసేలా చేస్తుంది !

No comments: