Showing posts with label కలలు. Show all posts
Showing posts with label కలలు. Show all posts

Monday, September 15, 2008

మనస్విని


కనురెప్పలకాపలా
కలలనూ ఆపలేకపోయింది
కన్నీళ్ళనూ ఆపలేకపోయింది

ఏకధాటిధారల్లో
కొట్టుకుపోయిన క్షణాలెన్నో

మబ్బువీడిన ఆకాశంలా హృదయం

ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి



Tuesday, August 01, 2006

కవిత‌


మనసు లోని భావాలు
మాటలుగా చెప్పలేనివేళ
అవి కలలై ..అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యద తీరాన్ని తాకినప్పుడు
మదిలోయల్లోంచి పలికేదే కవిత