అతని గుండె నిండిపోయిందనుకుంటానుకళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి - మరిచెదిరిన జ్ఞాపకాలు ఏరుకున్నాడో నిజమయిన చెలిమిని కనుగొన్నాడోఅతని మనసు మౌనమనే కొత్త భాష నేర్చుకుందిఆనందాన్ని వ్యక్తపరచడానికి
tears
ఈ బరితెగించిన బాధ ని చూడుకనుల సరిహద్దును దాటి చెంపలను తడుపుతుందికనికరం లేని కన్నీళ్ళుఎంత ఆపినా ఆగట్లేదుసంతోషమా నువ్వొచ్చి కట్టడిచేయొచ్చుగా....
అసలే నీ ఆలోచనలతో అలసిపోయిన అంతరంగంనీకై ఎదురుచూసి ఎదురుచూసి సొలసిపోయిందిమెల్లమెల్లగా చీకట్లోకి చేరిపోతున్న వెలుగులాకనులు నిజాన్ని విడిచి స్వప్నంలోకి జారిపోతున్నాయిఎప్పటికి తేరుకున్నానో..కానీ అప్పటికే జీవితాన్ని చేజార్చుకున్నానుకనుల కొలను నుండి చిమ్మిన ఆఖరి కన్నీరు బొట్టునువు తుడవకుండానే ఆవిరైపోయిందిచెంపలపై కన్నీటి చారికలు మాత్రం మిగిలినైమన ప్రేమకు [క్షమించాలి....నా ప్రేమకు]అవశేషాలు గా
కనులకు నచ్చినదానికన్నా మనసుకు
నచ్చిందే విలువైనదిగా అనిపిస్తుంది
మరణం కన్నా మరణిస్తామన్న ఊహే
భయంకరం గా అనిపిస్తుంది
వర్తమానం కన్న అది గతం లా
గుర్తుచేసుకున్నప్పుడే ఆనందం గా అనిపిస్తుంది
నాకు నీతో వుంటున్నప్పటికన్నా
నీ జ్ఞాపకమే హాయి గా అనిపిస్తుంది
ఎవరో అన్నట్టుగా
నేను నీకన్నా నిన్ను ప్రేమిస్తున్నానన్నభావననే
ఎక్కువ ప్రేమిస్తున్నానేమో?
ఏమిటో నీ ఊహల జడిలోఎంత తడిసినా తనివి తీరదుఅమ్మ చేతి గోరుముద్ద తింటున్నట్టుగావుంటుంది నీ జ్ఞాపకంఆకాశం లో హరివిల్లు విరిసినప్పుడల్లానీ నవ్వే గుర్తొస్తూ వుంటుందిఎందరి యదల రొదలోనీ పేరు స్వరమై వుందో ..ఎందరి కలల కన్నుల్లొ నీరూపు నిలిచిపోయిందో నీకు తెలుసాఇంతకి నువ్వెక్కడ వున్నావు?ఆరాధకుల గుండెల్లో కాకుండా..నువ్వెప్పుడు వస్తావు?రెప్పల మాటున స్వప్నం లా కాకుండా
తనొక జ్ఞాపకమై వుంటానందినేను వద్దన్నానుతనొక అనుభూతిగా మిగులుతానందినేను కుదరదన్నానుగుండెల్లొ నిలుస్తానుగా అందిసదా కళ్ళెదుట వుండమన్నానుగతమై నా వెనుక వుంటానందిజత గా నా పక్క నడవమన్నానుజన్మంటూ వుంటే నీ కోసమే అందినీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నానుమొదట ఓదార్చింది--తరువాత వివరించిందిబ్రతికి సాధించమందిసాధించి దానిలో తనను బ్రతికించమందికళ్ళు తుడుచుకున్నాను నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూఎదురుగా నా లక్ష్యం రూపం లో ఆమె
ఒక అందమైన భావనకి వేవేల రూపాలుఅమ్మ-నాన్నఅన్న-చెల్లిఅతడు-ఆమెనువ్వు-నేను...ఇలా ఎన్నోఅన్ని మనసుల మధ్యా ఉన్న ఒకే వారధి ప్రేమఅమ్రుతం తాగిందేమో ఈ ప్రేమనిత్యం యవ్వనం తో వుంటుందిఅందరిని తనలో నింపేసుకుంటూఅందరినీ తనతో కలిపేసుకుంటూ...మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]...ఇలాఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలిందిచిరంజీవిగా ఈ ప్రేమ
నీ కళ్ళలోకి చూసిన ప్రతీసారి
నాకు తెలుస్తుంది..నా మీద నీకున్న భావనేమిటో
నాకోసం నీవుపడే ఆరాటం చెపుతుంది..
నేను నీకు ఏమవుతానో
అప్పుడప్పుడు నా కళ్ళకి పట్టుబడే
నీ కన్నుల తడబాటు చూస్తుంటే
భలే సరదా అనిపిస్తుంది
నీ యద ఘోష నాకు తెలుసురా..అని
చెవి మెలిపెట్టి మరీ చెప్పాలనిపిస్తూవుంటుంది
కానీ
ఇంతగా ఆరాధిస్తున్న నువ్వు
ఆ మాట చెపుతుంటే వినాలనివుంది
అందుకే...గోదారి లాంటి నా ప్రేమకు ఆనకట్ట వేసి
తొలకరి చినుకు లాంటి నీ మాటకై ఎదురుచూస్తున్నాను
నీ అడుగు తో జత కలిపే క్షణం కోసం ఆశగా నిరీక్షిస్తున్నాను
ఎన్నో చిందర వందర ఆలోచనల మద్యఒక్కసారిగా నీ ఊహనీ తలపు రాగానే ఆలోచనలన్నీ అలిగి ఎటోవెళ్ళిపోయాయినీకూ నాకూ ఏకాంతం కల్పిస్తూ ....తమస్సు లో తారలా నా మనస్సు లో నువ్వు ఆనందాలని సొంతం చేస్తూ..అంధకారాన్ని దూరం చేస్తూ..